Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుల బాధ తట్టుకోలేక ప్రముఖ డ్యాన్సర్ ఆత్మహత్య... సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో

Choreographer Chaithanya commits suicide
Advertisement
  • నెల్లూరులో సెల్ఫీ వీడియో తీసుకొని చైతన్య ఆత్మహత్య
  • అప్పు తీర్చే శక్తి ఉన్నప్పటికీ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని వీడియో
  • ఢీ షో ద్వారా మంచి కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న చైతన్య
Advertisement
ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక నెల్లూరులోని క్లబ్ హోటల్ లో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఢీ షోలో డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న చైతన్య కొరియో గ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు... చైతన్య సారీ చెప్పాడు. అప్పులు తీర్చగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నాడు. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం.. ఇలా అప్పు మీద అప్పు తనకు ఇబ్బందిని కలిగించినట్లు చెప్పాడు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోలకు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
Advertisement
Advertisement
Nellore District
Crime News
Chaitanya
Choreographer

More Telugu News